![]() |
![]() |
.webp)
రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా "డేంజరస్" మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్ ని వెరైటీగా ప్లాన్ చేసాడు. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి.. ఆమె కాళ్ల దగ్గర కూర్చుని ఆమె పాదాలను ముద్దాడుతూ కనిపించి సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు..ఈ మొత్తాన్ని ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు స్పూఫ్ గా చేసి చూపించారు. రేపు ఆదివారం ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయ్యింది.
ఇందులో చూస్తే హైపర్ ఆది రామ్ గోపాల్ వర్మగా, నాటీ నరేష్ అష్షు రెడ్డిగా నటించి డేంజరస్ మూవీ ప్రమోషన్ బిట్స్ ని స్పూఫ్ గా చేసి చూపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. నరేష్ పసుపు రంగు డ్రెస్ లో కుర్చీలో కూర్చుని "లెట్స్ వెల్కమ్ రాము" అని అనౌన్స్ చేసేసరికి "వచ్చిండు చూడు మన జిన్నాబాయ్" సాంగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంటే ఆది క్యాప్ పెట్టుకుని వచ్చి స్టేజి మీద నరేష్ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.
"ఈరోజు నేను నీ అందాన్ని ఆస్వాదించడానికి వచ్చాను" అని ఆది అన్నాడు. నరేష్ సిగ్గుపడుతూ "వేర్ యు లుక్కింగ్ రాము " అని అడిగేసరికి "నీ లెగ్స్ అంటే నాకు చాలా ఇష్టం" అని నరేష్ కాలి స్లిప్పర్ తీసి చూసాడు. "ఎలా ఉంది" అని నరేష్ అడిగేసరికి "బాగుంది..నువ్ స్నానం చేసి ఉంటే ఇంకా బాగుండేది" అన్నాడు ఆది. "నాకు దెయ్యంతో రొమాన్స్ చెయ్యాలనుంది" అని ఆది అడిగేసరికి "రొమాన్సా..రా అని నరేష్ ఆదిని దగ్గరకు తీసుకుని మరీ ముద్దు పెట్టించుకున్నాడు".. ఇలా ఆది, నరేష్ చేసిన ఈ స్కిట్ ఈ షోకి హైలైట్ గా నిలవబోతోంది.
![]() |
![]() |